Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘బాజీరావ్ మస్తానీ’పై నిషేధం విధించాలి: శివసేన ఎమ్మెల్యే డిమాండ్

ఈ నెలలో విడుదల కానున్న సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బాజీరావ్ మస్తానీపై నిషేధం విధించాలని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నెక్ డిమాండ్ చేశారు. ఈ చిత్రం మరాఠీ ప్రజలు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రతాప్ సర్నెక్, బాజీరావ్ మస్తానీ వారసుడు పెష్వా బాజీరావ్ I, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో బాజీరావ్ మస్తానీని సరైన పద్ధతిలో చూపలేదని ఆరోపించారు. ఇటువంటి సన్నివేశాల ద్వారా మహారాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో బాజీరావ్ మస్తానీ గురించి తప్పుడు సందేశమిచ్చేలా ఉన్న కొన్ని సన్నివేశాలను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంలోని ఒక పాటలో బాజీరావ్ మస్తానీ పాత్ర చేసిన డ్యాన్స్ చాలా అసభ్యంగా ఉందన్నారు. చరిత్రకారుల నుంచి, మస్తానీ వారసుల నుంచి సరైన సలహాలు, సూచనలు తీసుకోవాలని, ఈ చిత్రంలోని అసభ్య సన్నివేశాలను తొలగించాలని ప్రతాప్ సర్నెక్ డిమాండ్ చేశారు.

More Telugu News